Home  »  TV News  »  Brahmamudi: ఇందు, రాజుల పెళ్లి గుట్టు విప్పేసిన ఐశ్వర్య.. రేఖకు మైండ్ బ్లాక్!

Updated : Jun 21, 2026


స్టార్ 'మా' లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1064 లో..... ఈ ఐశ్వర్య ఏంటి ఇంకా ఫోన్ చెయ్యలేదని లక్కీ అనుకుంటాడు. అప్పుడే రాజు ఎక్కడున్నాడని తన దగ్గరికి చలపతి -లక్ష్మీ వస్తారు. నాకు తెలియదు అంకుల్ అని లక్కీ చెప్తాడు. నీకు వాడి గురించి తెలియకుండా ఉండదు. నిజం చెప్పమని కోప్పడుతాడు. నిజం అంకుల్ వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నానని లక్కీ అంటాడు. అప్పుడే రాజు నుంచి ఫోన్ వస్తుంది.ఏంట్రా తెలియదన్నావని చలపతి అంటాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడు లేదంటే చంపేస్తానని చలపతి అనగానే లక్కీ లిఫ్ట్ చేస్తాడు. ఒరేయ్ ఎక్కడున్నావ్ రా ఇక్కడ పార్టీ స్టార్ట్ అయిందని అంటాడు. ఫోన్ కట్ కాగానే తెలియదన్నావ్ ఇప్పుడు చెప్పు ఎక్కడున్నాడని చలపతి అడుగుతాడు. మరొకవైపు ఇందు కొత్త సీఈఓ అని రేఖ తనని స్టేజ్ పైకి తీసుకొని వెళ్తుంది. మీకు కంపెనీ గురించి ఏం తెలుసని అక్కడికి వచ్చిన అతను అడుగుతాడు. నాకు మా రేఖ ఆంటీ అంతా చెప్పింది బిజినెస్ గురించి నేర్పించిందని ఇందు చెప్తుంది. ఇందు మాట్లాడుతుంటే ఒక క్లయింట్.. మేం మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు.. మీ కంపెనీకి కస్టమర్స్ మీ ఈ రేఖ వచ్చాక తనపై నమ్మకం లేక వెళ్లిపోయాం. ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు చాలా నమ్మకంగా ఉంది ఇప్పుడు నీ కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తానను అతను అంటాడు. మరొకవైపు చలపతి, లక్ష్మి పార్టీ దగ్గరికి వస్తారు. లక్కీ గాడు చెప్పిన అడ్రెస్ ఇదే అంటూ లోపలికి వెళ్తాడు. వాళ్ళని అపర్ణ చూసి మీరు ఇక్కడ ఏంటని అడుగుతుంది. మా అబ్బాయి రాజు ఇక్కడ ఉన్నాడని తెలిసిందని లక్ష్మీ అనగానే వీళ్లకి వాళ్ళకి పెళ్లి అయినట్లు తెలియదని ఇందు చెప్పింది కదా అని అపర్ణ అనుకుంటుంది. మీరు ఇక్కడే ఉండండి రాజుని తీసుకొని వస్తానని అపర్ణ అంటుంది.

అపర్ణ వెళ్లి రాజుకి చెప్పగానే రాజు వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. నేను ఇందు ఇక్కడ బిజినెస్ పని మీద వచ్చామని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వెళ్లడం రేఖ చూస్తుంది. ఎవరు వాళ్ళు అని రాజుని రేఖ అడుగుతుంది. మరి లోపలికి తీసుకొని రాకుండా పంపిస్తున్నావని రేఖ అంటుంది. రాజు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. తరువాయి భాగంలో ఐశ్వర్య అందరి ముందు రాజు, లక్కీ మాట్లాడుకున్న వీడియో ప్లే చేస్తుంది. అందులో నాకు ఇందుకి పెళ్లి కాలేదు యాక్టింగ్ చేస్తున్నామని రాజు అనడం విని అనడం రేఖ వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.